కుంకుమ పువ్వు అమృత గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
kumkuma puvvu serial: అమృత అనగానే కుంకుమ పువ్వు సీరియల్ గుర్తొస్తుంది. తొలిసిరియల్ తోనే ఆడియన్స్ మనసు దోచుకున్న ఈమె మళయాళీ అయినా, తెలుగింటి ఆడపడచులా ఉంటుంది. ఈమె అసలు పేరు ప్రిన్సి బి కృష్ణన్. ప్రేమ అనే మరో సీరియల్ లో కూడా తన నటనా సామర్ధ్యాన్ని చాటుకుంది. కన్నడ సీరియల్ లో నటిస్తున్న అమృతను చూసిన డైరెక్టర్, తెలుగు సీరియల్ లో నటించే ఛాన్స్ ఇచ్చాడు.
అలా కుంకుమ పువ్వు ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగు,మలయాళ,కన్నడ భాషల్లో బాగానే మాట్లాడుతుంది. తాను యాక్టర్ కావడం తన తల్లికి చాలా ఇష్టమని,అందుకే తనను బాగా ప్రోత్సహించారని అమృత చెప్పుకొచ్చింది. సాంప్రదాయ క్యారెక్టర్స్, పద్దతిగా నటించడం తనకెంతో ఇష్టమని చెప్పింది. భాషాపరంగా తెలుగులో కొంచెం కష్టపడినా,చాలా త్వరగా తెలుగు భాష నేర్చుకున్నానని అమృత చెబుతోంది.
ప్రకాష్ రాజ్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని,ఆయనకు కూతురిగా నటించడమంటే తనకు ఇష్టమని చెబుతోంది. కన్నడ సీరియల్స్ ఎక్కువగా చేస్తున్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీ తనకు బాగా నచ్చిందని చెప్పింది. ఇక ఫ్రెండ్స్ తో కల్సి హైదరాబాద్ లో ఆర్ ఎస్ బ్రదర్స్ షాప్ కి వెళ్ళినపుడు, అక్కడ ఒకామె అమృతను చూసి ‘నీకు ఎన్ని కష్ఠాలు తల్లి. నిన్ను చూస్తుంటే మా ఇంటికి తీసుకెళ్లాలని ఉంది’అని జాలిగా బుగ్గ గిల్లుతూ అందట.
తెలుగు ఆడియన్స్ తనపై ఇంతలా ప్రేమ కురిపించడాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అమృత పేర్కొంది. హీరోయిన్ కన్నా విలన్ గా నటించడం తనకు భలే ఇష్టమని, ఎందుకంటే విలన్ క్యారెక్టర్ లో ఎన్నో కోణాలు ఉంటాయని చెప్పింది. అయితే డైరెక్టర్స్ అందరూ కూడా తనకి హీరోయిన్ గా ఆఫర్స్ ఇస్తున్నారు గాని,విలన్ గా ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదని అమృత కొంత ఆవేదనతో చెప్పింది.