వేసవి తాపాన్ని తగ్గించే చల్ల చల్లని తాటి ముంజల జ్యూస్ ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది
Thati Munjala Juice : ఈ వేసవిలో ఎండ దెబ్బ,వడదెబ్బ లేకుండా ఉండాలంటే ఈ వేసవిలో మాత్రమే లభ్యం అయ్యే తాటి ముంజలను తప్పనిసరిగా తీసుకోవాలి. కొంత మంది ముంజలను తినటానికి ఆసక్తి చూపరు. అలాంటి వారు ఇలా జ్యూస్ చేసుకొని తాగితే మంచిది. రెండు రకాల జ్యూస్ ల తయారీ తెలుసుకుందాం.
నాలుగు తాటి ముంజలను పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో తాటి ముంజల ముక్కలను వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పాలను పోయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల పంచదార వేసి మరొక సారి మిక్సీ చేసి గ్లాసు లో పోసుకొని తాగాలి. అయితే తీపి ఇష్టం లేనివారి కోసం మరొక జ్యూస్ తయారీ తెలుసుకుందాం.
నాలుగు తాటి ముంజలను పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో తాటి ముంజల ముక్కలను, ఒక కప్పు పెరుగు, పావు స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పుదీనా పేస్ట్ వేసి మిక్సీ చేసి గ్లాసు లో పోసుకొని తాగాలి.ఈ విధంగా తాగటం వలన ముంజలలో ఉండే పైటో కెమికల్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తాయి.
ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ,చెమట కాయలు,దద్ధుర్లు వంటివి రావు, అలాగే సాదరణంగా వేసవిలో జీర్ణ సంబంధమైన అజీర్ణం,మలబద్దకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాబట్టి ఈ వేసవిలో వచ్చే ముంజలను అసలు మిస్ కావద్దు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.