MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ గుర్తు ఉందా….ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Heroine Richa Gangopadhyay Facts:దగ్గుబాటి రానా డెబ్యూ చేసిన ‘లీడర్‌’ మూవీతో ఓ హీరోయిన్‌ కూడా డెబ్యూ చేసింది గుర్తుంది కదా.. ఆమె పేరే రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాకే యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత రవితేజతో ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’ సినిమాల్లో నటించింది. ప్రబాస్‌ హిట్‌ మూవీ ‘మిర్చి’లోనూ రిచా గంగోపాధ్యాయ తళుకున మెరిసింది.

ఆ తర్వాత నాగార్జునతో ‘భాయ్‌’లో కనిపించి, తర్వాత మాయమైపోయింది. స్టడీస్‌ పేరు చెప్పి యూఎస్‌కి వెళ్లి, అక్కడి బిజినెస్‌ స్కూల్‌లో క్లాస్‌మేట్‌ జోను ప్రేమించి పెళ్లాడి లైఫ్ లో సెటిలైపోయింది. అంతకు ముందే సెలెక్టివ్‌గా సినిమాలు చేసిన రిచా గంగోపాధ్యాయ ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.అయితే, అమెరికాలోనూ కరోనా మరణ మృదంగం మోగిస్తున్న వేళ, తాను సేఫ్‌గానే ఉన్నట్లు ఫ్యాన్స్‌కి తెలియజేస్తూ, లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తాజాగా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చింది.

చాలా సేపు ఫ్యాన్స్‌తో పిచ్చా పాటీ మాట్లాడింది. తనతో జత కట్టిన హీరోస్‌ గురించి సింగిల్‌ వర్డ్స్‌లో ఆన్సర్‌ ఇస్తూ, ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసింది. అయితే, మళ్లీ సినిమాల్లో నటించే ఛాన్సెస్‌ ఉన్నాయా.? అంటే, ఆ ప్రశ్నకు ఆశించిన రీతిలో సమాధానం రాలేదు అమ్మడి నుండి. ఇకపోతే, తెలుగుతో పాటు, సెలెక్టివ్‌గా కొన్ని తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ రిచా నటించింది.

2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన రీచా ప్రస్తుతం కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది తాజాగా మథర్స్ డే సందర్భంగా కొడుకుతో ఉన్న స్పెషల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంది.అమ్మగా మారి రెండు సంవత్సరాలు అవుతోంది తల్లి కావడం గొప్ప బహుమతి అంటూ కొడుకుతో దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి