పచ్చి గుడ్డు Vs ఉడికించిన గుడ్డు…ఏది తింటే మంచిది…నమ్మలేని నిజాలు
Boiled Egg vs Raw Egg : గుడ్డులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మందికి పచ్చి గుడ్డు తింటే మంచిదా…ఉడికించిన గుడ్డు తింటే మంచిదా అనే సందేహం ఉంటుంది. ఉడికించిన గుడ్డుతో పోలిస్తే పచ్చి గుడ్లులో పోషకాలు ఎక్కువని భావిస్తారు. కొంతమంది పచ్చి గుడ్డును పాలలో కలిపి తాగుతూ ఉంటారు.
ఈ రెండింటిలో పోషక విలువల గురించి తెలుసుకుందాం. పచ్చి గుడ్డు మరియు ఉడికించిన గుడ్డు రెండింటిలోను ప్రోటీన్,కొవ్వు పదార్ధం సమానంగా ఉంటుంది. గుడ్డును ఉడికించిన సరే పోషక విలువలను కోల్పోదు. పచ్చి గుడ్డులోని ప్రోటీన్ మరియు కొవ్వు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే జీర్ణం కావటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
అదే ఉడికించిన గుడ్డు అయితే తొందరగా జీర్ణం అవుతుంది. ఉడికించిన గుడ్డు వంద శాతం సురక్షితమైనదని చెప్పవచ్చు. అదే పచ్చి గుడ్డు అయితే వంద శాతం సురక్షితం అని చెప్పలేము. ఎందుకంటే పచ్చి గుడ్డులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కొన్ని అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
సాల్మొనెల్లా బ్యాక్టీరియా విటమిన్ బి (బయోటిన్) శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో కొన్ని సమస్యలు వస్తాయి. గుడ్డును ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డు చాలా సురక్షితమైనది. అలాగే ఉడికించిన గుడ్డులో కన్నా పచ్చి గుడ్డులో పోషకాలు ఎక్కువ అనేది ఒక అపోహ మాత్రమే.
పచ్చి గుడ్డు మరియు ఉడికించిన గుడ్డు రెండింటిలోను పోషకాలు సమానంగా ఉన్న సరే ఉడికించిన గుడ్డు తినటమే మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉడికించిన గుడ్డును తినటానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గుడ్డు తినటం కూడా మన ఆరోగ్యానికి మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.