ఈ ఆకు గురించి ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు… ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…
custard apple leaves benefits In telugu : తియ్యని రుచిలో ఉండే సీతాఫలం అంటే పిల్లల నుండి పెద్దవారి వారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే సీతాఫలంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సీతాఫలం ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడి అయ్యాక రెండు సీతాఫలం ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా ఉదయం సమయంలో పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో చక్కెర శోషణ నిదానంగా జరిగేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది.
ఈ ఆకులలో అధిక పరిమాణంలో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం గుండె కండరాలకు విశ్రాంతినిస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
జీవక్రియ రేటును పెంచి శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన గాయాలను నయం చేస్తుంది. ఈ సీజన్ లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ నీటిని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.