వంటలక్కకు ఎన్ని కోట్ల అస్థి ఉందో తెలిస్తే షాక్ అవుతారు
karthika deepam serial Premi Vishwanath :కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ చూసే అభిమానులకు వంటలక్క అంటే చాలా అభిమానం. ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ మంచి క్రేజ్ సంపాదించింది. కార్తీకదీపం సీరియల్ అత్యధిక టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది దీనికి కారణం ప్రేమి విశ్వనాథ్ అని చెప్పవచ్చు.
ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం ఒక్కో ఎపిసోడ్ కోసం లక్ష రూపాయల వరకు తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది. ఆమె ఆస్తులు విషయానికొస్తే 36 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ప్రేమి విశ్వనాధ్ కర్ణాటక లో ఫేమస్ జ్యోతిష్యుడు వినీత్ భట్ ని ప్రేమించి పెళ్లాడింది.
ప్రేమి విశ్వనాధ్ కి రెండు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టూడియోస్ ఉన్నాయి.కన్నడ లో ప్రతీ సీరియల్ మరియు సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మా స్టూడియోస్ లోనే చేస్తుంటారు. ఆదాయం కూడా బాగానే ఉంటుందని సమాచారం.
ఒక పక్క నటిస్తూ మరో పక్క స్టూడియోస్ ని చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతుంది. ఆమెకి కర్ణాటక లో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయట, వాటి విలువ వందల కోట్ల రూపాయిల లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి.