Healthhealth tips in telugu

చల్లగా ఉంటుందని ఎక్కువగా ఏసీలోనే ఉంటున్నారా ? ఈ సమస్యలు రావొచ్చు..

Disadvantages of AC: ఈ వేసవి కాలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఏసీలో ఎక్కువగా ఉంటున్నారు. ఇలా ఏసీలో ఎక్కువగా ఉండటం వలన అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏసి ప్రతిరోజు వాడేవారు AC కారణంగా కలిగే సమస్యల గురించి తెలుసుకోవాలి.
air conditioner
ఎయిర్ కండిషనర్ గదిని చల్లబరచడానికి మరియు తేమను తగ్గించడానికి గది నుండి తేమను తీసుకుంటుంది. అలాగే మన చర్మం నుండి కూడా నీటిని లాగుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్, చర్మం పొడిబారటం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా తలనొప్పి లేదా మైగ్రేన్ ప్రమాదాన్ని పెంచుతుంది. మైగ్రైన్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా AC ని ఉపయోగించకూడదు. శరీరం వేడిని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. వేడి ప్రదేశంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది.

కళ్ళు పొడిగా మారి కలలో దురద, చికాకు వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏసీలో కొంత సమయం గడిపి బయట ప్రదేశంలో కూడా కొంత సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఎటువంటి సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.