మామిడి పండు తిని తొక్కను పాడేస్తున్నారా…ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు
Mango peel benefits:ఈ సీజన్లో మామిడి పండ్లు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి మనలో చాలా మంది చిన్నపిల్లలనుంచి పెద్దవారి వరకు మామిడిపండ్లను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మామిడిపండును తొక్క తీసి తింటూ ఉంటాం. అయితే ఆ తొక్కలో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మామిడి పండు లేదా కాయ తొక్కలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు చాలా సమృద్దిగా ఉంటాయి. మామిడి తొక్కల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు మరియు పీచు గుండెకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మామిడి తొక్కలో ఆకలిని నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు సమృద్దిగా ఉండుట వలన బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. పైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మామిడి తొక్కలలో విటమిన్ ఎ మరియు సి,యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉండుట వలన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మామిడిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. మామిడి తొక్కలలో ఉరుషియోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అలెర్జీ రావటానికి కారణం కావచ్చు. కాబట్టి అలెర్జీ సమస్య ఉన్నవారు మామిడి తొక్కకు దూరంగా ఉండటమే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.