MoviesTollywood news in telugu

Tarun “నువ్వే కావాలి” సినిమా వెనక కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Nuvve Kavali Movie : రోజారమణి కొడుకు తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘నువ్వే కావాలి’సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాదాపు 16 రెట్లు లాభాలు సాధించి అందరినీ స్టార్స్ గా మార్చిన మూవీ నువ్వే కావాలి చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ అయింది. స్రవంతి రవికిశోర్ తీసిన ఈమూవీ విషయాల్లోకి వెళ్తే,మలయాళ మూవీ నిరం సంచలన విజయం సాధించడంతో ముత్యాల సుబ్బయ్య ,భీమినేని శ్రీనివాసరావు తెలుగు రీమేక్ హక్కుల కోసం ట్రై చేసారు.
Nuvve Kavali Movie
కానీ రెండు మూడు లక్షలుండే రైట్స్ 70 లక్షలు చెప్పడంతో వాళ్ళు ఊరుకున్నారు. అయితే జెడి చక్రవర్తికి,నిరం డైరెక్టర్ కి మంచి రిలేషన్ షిప్ ఉండడంతో అతడి ద్వారా స్రవంతి రవికిశోర్ ట్రై చేయడంతో 5లక్షలకే బేరం కుదిరింది. ముందుగా మహేష్ బాబుతో చేయాలనీ సిడి పంపితే నెలరోజులయినా నో రెస్పాన్స్. దాంతో సుమంత్ ని అడిగ్గా, అప్పటికే రెండు పెద్ద సినిమాల వలన నో చెప్పాడు.

కొత్తవాళ్లతో తీయాలని ప్లాన్ చేస్తే 75 లక్షల బడ్జెట్ తేలింది. అంత ఖర్చు భరించడం కష్టమని ,రామోజీరావు సహకారం అడిగారు. జీతం ప్లస్,20శాతం లాభం ఇస్తామని, ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో రవికిశోర్ రెడీ అయ్యాడు. టివిలో యాడ్ చూడగా , కుర్రాడు క్యూట్ గా ఉన్నాడు ఎవరా ఆరా తీస్తే,రోజారమణి కొడుకు తరుణ్ అని తేలింది. దాంతో అతడిని ఆడిషన్స్ కి పిలిచారు.

జ్వరం ఉన్నా సరే, ఆడిషన్స్ కి వచ్చి,సెలెక్ట్ అయ్యాడు. హీరోయిన్ గా రిచాను సెలెక్ట్ చేసారు. డైరెక్టర్ గా విజయభాస్కర్ ని పెట్టగా, స్క్రిప్ట్ రైటర్ గా త్రివిక్రమ్ ని పెట్టుకున్నారు. కోటి మంచి బాణీలు అందించాడు. రామోజీ ఫిలిం సిటీలో 90 శాతం షూటింగ్ చేసారు. కోటి 15లక్షలు బడ్జెట్ అయింది. 13 అక్టోబర్ 2000లో 36సెంటర్స్ లో రిలీజయింది.

బాగుంది అనే టాక్ తో మొదలై యమ రేంజ్ కి వెళ్ళింది. 230 సెంటర్స్ లో 100రోజులు, 30సెంటర్స్ లో 200రోజులు,6సెంటర్స్ లో 365రోజులు ఆడింది. నైజాం లో ఏడుకోట్ల షేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని చోట్లా కల్పి 18కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. హైదరాబాద్ థియేటర్ లో 100వ రోజు అమ్మాయిలు అబ్బాయిలతో నిండిపోయింది. సాంగ్స్ మళ్ళీ ప్లే చేయాలనీ గొడవ చేయడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు.