Beauty Tips

ఈ 3 ఆకులతో ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు అనేది అసలు ఉండదు

Hair Loss Tips : జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అనేవి మనలో చాలా మందిని వేదిస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే అసలు కంగారూ పడవలసిన అవసరం లేదు. మనకు సులభంగా దొరికే మూడు ఆకులను ఉపయోగించి జుట్టు రాలే సమస్య నుండి బయట పడటమే కాకుండా జుట్టు ఒత్తుగా,నల్లగా పెరుగుతుంది.

దీని కోసం పది జామ ఆకులు, 10 మందార ఆకులు, గుప్పెడు మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత పావు కప్పు పెరుగు పోసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా ఆరోగ్యంగా పెరగటమే కాకుండా జుట్టు నల్లగా కూడా ఉంటుంది. ఈ ఆకులు సహజసిద్దంగా దొరకకపోతే ఈ పొడులు మార్కెట్ లో లభ్యం అవుతాయి. వాటిని కూడా ఉపయోగించవచ్చు. లేదా ఈ ఆకులు విరివిగా దొరికినప్పుడు ఆరబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
Hibiscus leaf
జామ ఆకులు, మునగాకు, మందార ఆకులలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.