7 రోజుల్లో మొటిమలు,మొటిమల వల్ల వచ్చే మచ్చలు,గుంటలు అన్నీ మాయం అవుతాయి
Pimples Remove Tips : మొటిమలు.మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు,గుంటలు అనేవి సాదరణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజ సిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
పది బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసేసి మిక్సీలో వేసి పాలను తయారుచేయాలి. కుంకుమ పువ్వును రోజ్ వాటర్ లో నానబెట్టాలి. ఒక బౌల్ లో బాదం పాలు, రోజ్ వాటర్ లో నానిన కుంకుమ పువ్వు,రెండు స్పూన్ల ఆలోవెరా జెల్,రెండు విటమిన్ E capsule లోని ఆయిల్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో ముఖం మీద మొటిమలు,మచ్చలు గుంటలు అన్నీ తొలగిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.