ఒకే ఒక్కడు సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Oke Okkadu Movie :సినీ ప్రపంచంలో ఎవరు స్టార్ అవుతారో ఎవరికి ఎంత ఫాలోయింగ్ వస్తుందో చెప్పడం చాలా కష్టం. కొందరు హీరోలు కథలు ఎంచుకోవడంలో తప్పు చేస్తూ మంచి మంచి సినిమాలను వదులుకుంటారు. ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్రతి హీరో కలగంటాడు.
అలాంటిది శంకర్ ఒక సినిమా కోసం ఇద్దరు హీరోలను సంప్రదిస్తే రిజెక్ట్ చేశారట. ఆ సినిమా ఒకే ఒక్కడు.సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోగా ఉన్న విజయ్ తండ్రి వద్దకు వెళ్లి శంకర్ కథ వినిపించాడట.
విజయ్ తండ్రి విజయ్ కి కథ చెప్పమని చెప్పాడట. శంకర్ వెళ్లి విజయ్ కి కథ చెబితే సమయం లేదని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత శంకర్ రాజశేఖర్ వద్దకు వెళ్లడం… రాజశేఖర్ కూడా రిజెక్ట్ చేశాడు. అప్పుడు హీరో అర్జున్ తో ఈ సినిమా చేసి తెలుగు తమిళం రెండు భాషల్లోనూ సూపర్ హిట్ కొట్టాడు.