ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…
Seema Chintakaya:ఈ కాయలను ఎప్పుడైనా చూసారా…ఇవి గ్రామాల్లో ఉన్నవారికి సుపరిచితమే. ఈ చెట్లు రోడ్డు పక్కన కనపడుతూ ఉంటాయి. వీటి పేరు సీమ చింతకాయలు. లేత గులాబీ రంగులోకి మారిన తరువాత వీటిని తింటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి దొరకటం కష్టమైపోతోంది. ఎవరూ ఈ చెట్లను ప్రత్యేకంగా పెంచడం లేదు.
కాబట్టి సీమ చింతకాయలు ఎక్కడైనా కనపడితే అసలు వదిలిపెట్టవద్దు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. వీటిల్లో ఫైటో కెమికల్స్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిక్ లక్షణాలను తగ్గేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాలేయ పనితీరును మెరుగుపరచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
శరీరంలో హానికర టాక్సిన్స్ బయటకు పంపుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన ప్రేగులోని సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. వీటిలో ఉండే ఒలియానోలిక్ యాసిడ్ సహజంగానే ప్రేగు పనితీరును మెరుగు పరుస్తుంది. విటమిన్ సి, డైటరీ ఫైబర్, సపోనిన్స్ సమృద్దిగా ఉండుట వలన బరువును తగ్గించటంలో సహాయపడుతుంది.
ఇందులో డైటరీ ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల సహజంగానే బరువు తగ్గుతారు. వీటిల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాలను అందించి నీరసం తగ్గిస్తుంది. ఈ కాయలలో ఉన్న క్యాల్షియం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలను కూడా ధృడంగా ఉండేలా చేస్తుంది. ఈ కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.