తులసి ఆకులను ఎలా తీసుకోవాలి..నమిలి తింటే మంచిదా…లేదా…నమ్మలేని నిజాలు
Tulasi health benefits In telugu :తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మొక్కను ఔషధ మొక్క గా పరిగణిస్తారు. అనేక రోగాలను నయం చేయడంలో తులసి దశాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన సమస్యలు, శరీరంలో విషాలను బయటకు పంపడానికి ఇలా తులసి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. .
అయితే తులసి ఆకులను నమిలి తింటే మంచిదా…అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. తులసి ఆకులను నమిలి తినటం వల్ల దంతాల ఏనామిల్ పాడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తులసి ఆకులలో పాదరసం, ఐరన్ ఎక్కువగా ఉండటం వలన తులసి ఆకులను నమిలి నప్పుడు అవి రెండూ ఎక్కువగా విడుదల అయ్యి పంటి ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది.
ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను తిన్నప్పుడు మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. వారంలో రెండు సార్లు తీసుకుంటే ఎటువంటి ప్రభావం ఉండదు. తులసిని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తాగవచ్చు…లేదంటే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. .
అప్పుడు తులసి లో ఉన్న ప్రయోజనాలు అన్ని మనకు అందుతాయి. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా తులసిని ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకోండి. తులసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలో ఉండే సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు సెరోటోనిన్ మరియు డోపమైన్‌లను సమతుల్యం చేస్తాయి.
తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు మరియు రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు కూడా కరుగుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.