MoviesTollywood news in telugu

మగధీర సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…!?

Ram Charan Magadheera Movie :చిరుత మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేసిన మగధీర మూవీతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. వందకోట్లు కలెక్ట్ చేసిన తొలితెలుగు మూవీగా మగధీర రికార్డు క్రియేట్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో రామ్ చరణ్ తన నటనతో సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. 2009 జులై 31న రిలీజైన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. కామెడీ,ఎమోషన్,గ్రాఫిక్స్,ఫైట్స్ అన్నీ కుదిరిన ఈ మూవీ చరిత్ర సృష్టించింది.
Ram Charan Magadheera movie
రెండు జన్మల ప్రేమ ఇతివృత్తంతో తెరకెక్కిన మగధీర మూవీలో శ్రీహరి కీలక పాత్ర పోషించాడు. ఇక కీరవాణి అందించిన సాంగ్స్ అన్నీ హిట్. మగధీరకు వారం రోజుల తర్వాత ఆగస్టు 7న నేచురల్ స్టార్ నాని నటించిన స్నేహితుడా మూవీ రిలీజయింది. హీరోయిన్ మాధవీలత మంచి నటన కనబరిచింది. అయితే ఈ మూవీ ఏవరేజ్ గా మిగిలింది.

నితిన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన అడవి మూవీ కూడా ఆగస్టు 7నే రిలీజయింది. అయితే ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ లో వర్మ మార్క్ ఉన్నా, పేలవంగా మిగిలింది. ఇక ఆగస్టు 12న వచ్చిన మాస్ మహారాజ రవితేజ నటించిన ఆంజనేయులు మూవీ ఏవరేజ్ అయింది. నయనతార హీరోయిన్ గా చేసిన ఈ మూవీకి పరశురామ్ డైరెక్షన్ చేసాడు. థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే మగధీర ముందు నిలబడలేకపోయింది.