వీటిని తీసుకుంటే చాలు నరాల బలహీనత,శారీరక బలహీనత అనేవి జీవితంలో ఉండవు
Nerve weakness Foods In telugu :నరాల బలహీనత అనేది పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య. నరాల బలహీనత ఉన్నప్పుడు చిన్న బరువుని లేపిన చేతులు లాగడం, ఏదైనా పని చేసిన కాసేపు నడిచిన వణుకు రావడం, తిమ్మిర్లు తీవ్ర అలసట వంటివి వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు నిర్లక్ష్యం చెయ్యకుండా నరాల బలహీనతను తగ్గించుకోవాలి. నరాల బలహీనత తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటే బాగా సహాయపడుతుంది. చేపలు, రొయ్యలు, పీతలు వంటివి వారంలో రెండు సార్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సీ ఫుడ్ లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వల్ల నాడీ వ్యవస్థను బలోపేతం చేసి నరాల బలహీనతను తగ్గిస్తుంది.
అంతేకాకుండా ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒక ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. బాదం, ఆప్రికాట్, వాల్ నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వాటిలో ఉన్న పోషకాలు నరాల బలహీనతని తగ్గిస్తుంది. అలాగే రోజుకి 20 నిమిషాలు వ్యాయామం యోగా వంటివి చేయాలి.
సరైన నిద్ర లేకపోయినా నరాల బలహీనత వస్తుంది. కాబట్టి ప్రతి రోజు 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి గా ఉండాలి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే నరాల బలహీనత,శరీరంలో బలహీనత కూడా తగ్గి ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. నరాల బలహీనత ప్రారంభంలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.