మామిడి పండు+పాలు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Mango and Milk Health benefits : మామిడి పండు,పాలు రెండింటిలోను ఎన్నో పోషకాలు అన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మామిడి పండ్లు విరివిగానే లభిస్తున్నాయి. మామిడి పండు జ్యూస్ లో పాలను కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండు,పాలను కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
మామిడి పండు జ్యూస్ లో పాలను కలపవచ్చు. లేదా మామిడి పండు ముక్కలలో పాలను పోసి మిక్సీ చేసి తీసుకోవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రోటీన్ల వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ప్రతి రోజు తాగుతూ ఉంటే తక్కువ బరువు ఉన్నవారు బరువు పెరుగుతారు. బరువు పెరగాలని అనుకొనేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
బీటా-కెరోటిన్ మరియు ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. దీనిని తీసుకోవటం వలన శరీరంలో ఐరన్ స్థాయిలు పెరిగి రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత తగ్గుతుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన పొడి కళ్ళు మరియు రాత్రి అంధత్వాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
మామిడి రసంతో పాలను కలపడం వల్ల కాల్షియం మరియు విటమిన్ డి చాలా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది. పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నిర్వహించడానికి మరియు మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.