ఫ్రిజ్ లో బంగాళదుంపలు పెడుతున్నారా… ఈ విషయాన్ని తెలుసుకోపోతే నష్టపోతారు
potato Benefits in telugu :
మనలో చాలా మందికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం. వేపుడు చేసిన కూర చేసిన గ్రేవీలో వేసిన చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ చాలా ఇష్టంగా తింటారు కొంతమంది బంగాళదుంపలను ఫ్రిజ్లో పెడుతుంటారు అలాగే బంగాళదుంప కూర మిగిలితే దానిని కూడా ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.
మనం ఎక్కువగా బంగాళదుంపలను వాడుతూ ఉంటాం. బంగళాదుంపలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయితే కొంతమంది చాలా ఎక్కువ రోజులు నిలువ ఉండాలని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. ఫ్రిజ్లో పెట్టకూడదు బంగాళాదుంపలు గాలి తగిలేలా డ్రై ప్లేస్ లోనే ఉంచాలి ఏమాత్రం తేమ తగిలినా త్వరగా పాడైపోతాయి.
బంగాళదుంపలను ఫ్రిజ్ లో పెడితే బంగాళదుంప లోని పిండి పదార్థం షుగర్ గా మారిపోతుంది అలాంటి దుంపలను తింటే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. బంగాళదుంపలను నిల్వ ఉంచాలి అనుకున్నప్పుడు వాటిని కడగకూడదు.
బంగాళదుంపలను వేరే కూరగాయలతో అసలు కలపకూడదు ముఖ్యంగా ఉల్లిపాయలతో బంగాళదుంపలను ఉంచకూడదు సాధ్యమైనంతవరకు డ్రై ప్రదేశంలో బంగాళదుంపలను ఉంచాలి.ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.