మూత్రంలో మంట,నొప్పి,యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా శరీరంలో వేడి ఉండదు
urinary tract infection Home remedies : యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్ఫెక్షన్ మరియు వాపుకు గురవుతుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సర్వసాధారణం.
దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
యూరిన్ ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడు అల్లం,వెల్లుల్లి చాలా బాగా సహాయపడతాయి. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను ఉడికించి తీసుకోవాలి.లేదా వెల్లుల్లిని పాన్ లో వేసి నూనె లేకుండా వేగించి కూడా తీసుకోవచ్చు. పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటానికి సహాయపడతాయి.
ఒక స్పూన్ అల్లం రసం తీసుకోవాలి. అల్లంలో ఉండే జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఇన్ ఫెక్షన్ తగ్గటానికి సహాయపడుతుంది. ఈ విధంగా అల్లం,వెల్లుల్లి తీసుకుంటూ డాక్టర్ సూచనలను పాటిస్తే చాలా తొందరగా యూరిన్ ఇన్ ఫెక్షన్ నుండి బయట పడవచ్చు. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే కొబ్బరి నీరు,మజ్జిగ, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.