కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ సమస్యలను తగ్గించే అద్భుతమైన శక్తి ఉన్న జ్యూస్…అసలు మిస్ కావద్దు
Kidney stones Home Remedies In Telugu : కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. 24 గంటలు కూడా విరామం లేకుండా పని చేస్తూనే ఉంటాయి. అవి శరీరంలోని విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందువల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని ఇతర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం…కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. ఈ మధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇబ్బంది పెడుతుంది. కిడ్నీలో రాళ్ళు చిన్నగా ఉంటే మూత్రం ద్వారా బయటికి పోతాయి.
అదే రాళ్లు పెద్దవిగా ఉంటే మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, జ్వరం రావడం, నడుం నొప్పి, మూత్రంలో రక్తస్రావం, తరచుగా మూత్ర విసర్జన చేయాలని అనిపించటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ లక్షణాలు కనపడగానే అసలు అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ సలహా సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే జ్యూస్ తీసుకుంటే చాలా తొందరగా మంచి ఫలితం కనబడుతుంది.
అరటి దూట (Banana Stem) కిడ్నీలో రాళ్ళను కరిగించటమే కాకుండా కిడ్నీ సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అరటి దూట పల్లెటూర్లలో ఉన్నవారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడు అన్నీ చోట్ల దొరుకుతుంది. అరటి దూటను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
అరకప్పు అరటి దూట ముక్కలను మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత కొంచెం రాక్ సాల్ట్, ఒక గ్లాస్ నీటిని పోసి మిక్సీ చేసి జ్యూస్ ని వడకట్టాలి. ఈ అరటి దూట జ్యూస్ ని అరగ్లాసు మోతాదులో తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళు క్రమంగా కరుగుతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.