Beauty Tips

ఇంటిలోనే వ్యాక్సింగ్ ఎలా చేసుకోవచ్చో తెలుసా?

Home made wax: వ్యాక్సింగ్ చేయించుకోవాలంటే బోలెడంత ఖర్చు పెట్టాలి. మధ్యతరగతి వారికి ఆ ఖర్చు కష్టంగానే అనిపిస్తుంది. ఇంటి దగ్గరే వ్యాక్స్ తయారు చేసుకుంటే ఎవరికి వారే వ్యాక్స్ చేసుకోవచ్చు దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. 

1. ఒక పాన్‌‌లో పంచదార (మీకు ఎంత వ్యాక్స్ కావాలనుకుంటున్నారో అంత పంచదార వేయాలి) వేసి వేడి చేయాలి. కాసేపటికి పంచదార కరిగి పాకంలా తయారవుతుంది. 

2. పంచదార పాకంలో కొన్ని చుక్కల తేనె, నిమ్మరసం కలపాలి. స్టౌ పైనే ఉంచి కలుపుతూ ఉండాలి. పాకం మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని చుక్కల నీళ్లు చేర్చాలి. 

3. ఆ మిశ్రమాన్ని స్టౌ మీద నుంచి దించి గది ఉష్ణోగ్రత వద్దకు చల్లార్చాలి. దానిని ఒక డబ్బాలో వేసి, ఫ్రిజ్ లో పెట్టాలి. ఎప్పడు కావాలంటే అప్పడు దానితో వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. ఇందులో వాడిన పదార్థాలన్నీ సహజసిద్ధమైనవి కావడంతో… మంట, దురద లాంటివి రావు. ఇది అవాంఛిత రోమాల్ని తొలగించడమే కాదు, చర్మానికి తేమని అందిస్తుంది. వ్యాక్సింగ్ చేశాక, కాళ్లకి, చేతులకి మాయిశ్చరైజర్ రాస్తే మంచిది.