2 రూపాయల ఖర్చుతో ఇలా చేస్తే అధిక బరువు డయాబెటిస్ వంటి సమస్యలు జీవితంలో ఉండవు
Weight Loss Tips In telugu :ఈ రోజుల్లో మారిన జీవన శైలి ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. దీనికోసం మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే మెంతులు బరువు తగ్గించడానికి సహాయపడటమే కాకుండా డయాబెటిస్ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మెంతులను వేగించి పౌడర్ గా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడి కలిపి తాగాలి.
లేదంటే పొయ్యిమీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ మెంతులను వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి వడకట్టి ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగడం వలన అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.
ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సంబంద సమస్యలు అయిన కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.