Healthhealth tips in telugu

5 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడల చుట్టూ కొవ్వును మైనంలా కరిగిస్తుంది

jeera and jaggery weight loss benefits in telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో అధిక బరువు సమస్య అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మనలో చాలా మంది ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.
Weight Loss tips in telugu
అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే పెద్దగా ఫలితం ఉండదు. బరువు తగ్గడం కోసం ఆహారం తీసుకోవటం కూడా బాగా తగ్గించి వేస్తారు. ఇలా చేయడం చాలా తప్పు. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే బరువు సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా .పనిచేస్తుంది.ఈ చిట్కా కోసం కేవలం ఒకే రెండు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం.
jeelakarra Health Benefits in telugu
జీలకర్ర, బెల్లం బరువు తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తాయి. జీలకర్ర తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా శక్తిగా మారేలా చేస్తుంది. జీలకర్ర,బెల్లం కొవ్వు కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బరువు కోల్పోయినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి అయితే జీలకర్ర బరువు తగ్గినప్పుడు ఎముకలు బ బలహీనంగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
jaggery Health benefits in telugu
జీలకర్ర నీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ జీలకర్ర వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగిస్తే జీలకర్రలో పోషకాలు నీటిలో చేరతాయి. నీరు పసుపు రంగులోకి మారాక బెల్లం వేయాలి. ఒక నిమిషం పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా 15 రోజులు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
Weight Loss Tips in telugu
బరువు తగ్గటం కోసం మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. దాని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటిలో ఉండే వస్తువులతో సహజసిద్దంగా బరువు తగ్గవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.