ఈ ఆహారాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి అనేవి అసలు ఉండవు
Calcium Rich Foods : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది కాల్షియం లోపం కారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా మంది నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు.
అలా కాకుండా కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇలాంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుపచ్చని ఆకుకూరల్లో, కూరగాయల్లోనూ కాల్షియం సమృద్దిగా ఉంటుంది. కాబట్టి వారంలో మూడు రోజులు ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ లో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా డ్రై ఫ్రూట్స్ తినమని సిఫార్స్ చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ వలన ఎన్నో పోషకాలు అందటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరెంజ్, కమలలో విటమిన్-సి అలాగే కాల్షియం ఉంటుంది. ఒక కప్పు (200 గ్రాములు) ఒలిచిన నారింజ, కమలలో 72.2 మి.గ్రా కాల్షియం ఉంటుంది.
బీన్స్ పప్పు ధాన్యలులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో కాల్షియంతో పాటు ప్రోటీన్, ఐరన్, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ ఉంటుంది. ఇటువంటి ఆహారాలను తప్పనిసరిగా ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.