Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు కాఫీ ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా ?

Coffee and Diabetes : మనలో చాలా మండి ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగాలసిందే. ఒకవేళ కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పని చేయాలని అనిపించదు. రోజంతా ఎదోలా ఉంటుంది. ఉదయం సమయంలో బ్లాక్ కాఫీ లేదా టీ ఎక్కువగా తాగటం మంచిది కాదని ఒక పరిశోదనలో తేలింది.
Diabetes In Telugu
ఉదయం తీసుకొనే కాఫీ ఆ తర్వాత తీసుకొనే ఆహారం మీద ప్రభావం చూపి జీవక్రియ మరియు చక్కెర స్థాయిలు దెబ్బతింటాయి. అందువల్ల రాత్రి పడుకొని ఉదయం లేచాక బ్రేక్ ఫాస్ట్ చేశాక కాఫీ లేదా టీ తాగటం మంచిదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక కాఫీ లేదా టీ తాగితే మంచిదని అంటున్నారు నిపుణులు.
Coffee benefits in telugu
ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్ రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం అనేది డయాబెటిస్ నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.