టెట్రా ప్యాక్స్, ప్యాకెట్లలో మజ్జిగ తాగుతున్నారా….ప్రమాదంలో పడినట్టే
Butter Milk benefits in telugu :వేసవి కాలం మొదలైంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంటిలో నుంచి ఆఫీస్ లో నుంచి కాలు బయట పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది. వేసవి వేడిని తట్టుకోలేక ఫ్రిజ్ లో వాటర్ త్రాగటం, చెరుకు రసాలు, కూల్ డ్రింకులు, నిమ్మకాయ రసం, మజ్జిగ వంటివి త్రాగుతూ ఉంటాం. అయితే వీటి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోకపొతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
వేసవిలో దాహాన్ని తీర్చటానికి ముందు వరుసలో మజ్జిగ ఉంటుంది. మజ్జిగను ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్ రూపంలో అమ్ముతున్నారు. కూల్ డ్రింక్స్ త్రాగటం కన్నా మజ్జిగ త్రాగటమే మంచిది. వేసవిలో మజ్జిగ తీసుకోవటం వలన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా మజ్జిగ కాపాడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా మజ్జిగ ప్యాకెట్ విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ప్యాకెట్ మజ్జిగను త్రాగవచ్చు. మజ్జిగను కొనేటప్పుడు ప్యాకెట్‌పై డేట్ చూసి తీసుకుంటే మంచిది. ఔట్ డేటెడ్ మజ్జిగ ప్యాకెట్లు కావని నిర్ధారణ చేసుకోవాలి. ఔట్ డేటెడ్ మజ్జిగ ప్యాకెట్లు కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. మంచి పేరున్న బ్రాండ్ కంపెనీల మజ్జిగను తీసుకోవడం మంచిది.
ప్లాస్లిక్ కవర్లలో మజ్జిగను ప్యాక్ చేసి అమ్ముతుంటారు. ఇలాంటి మజ్జిగ వల్ల ఆరోగ్య నష్టాలు వున్నాయి అంటున్నారు వైద్యులు. మజ్జిగలో నీళ్లతో పాటు తైల బిందువులు, లాక్టోజ్, అమైలోజ్, వంటి పిండి పదార్థాలు, లవణాలు, కొంత ఆల్కహాలు, బ్రతికే ఉన్న ఈస్ట్ బాక్టీరియా వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ప్లాస్టిక్ సంచుల్ని కడగకుండానే పాల కేంద్రాల్లో లేదా దుకాణాల్లో మజ్జిగను, పాలను నింపుతూ ఉంటారు.
ఆ సమయంలో పాలు, మజ్జిగ వంటి పదార్థాల్లో ఉన్న సేంద్రియ లక్షణం ఉన్న పదార్థాలకు, ప్లాస్టిక్ సంచుల్లో మిగిలిపోయిన సేంద్రియ మలినాలకు మధ్య రసాయనిక చర్య జరిగి అనారోగ్యకారకాల్ని ఏర్పర్చవచ్చు. ఎండ వేడిమి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి దొరికింది ఎదో ఒకటి తాగేద్దామనుకుంటే కుదరదు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా వుండాలి. ప్యాకెట్ల మీద డేట్లు, బ్రాండింగ్ చూసి కొనుక్కోవాలి. అప్పుడే మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.
https://www.chaipakodi.com/