Healthhealth tips in telugu

రోజుకి 1 లడ్డు తింటే అలసట,నీరసం లేకుండా ఎంతో బలాన్ని,ఆరోగ్యాన్ని ఇస్తుంది

Healthy Energy Laddu : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదొక సమయంలో ఏదొక సమస్యతో బాధపడుతున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అలసట,నీరసం వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి ఒక లడ్డు తయారుచేసుకుందాం.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి అరకప్పు బాదం పప్పును వేసి ఒక నిమిషం వేగాక, అరకప్పు జీడిపప్పు, అరకప్పు పిస్తా పప్పు వేసి మరో రెండు నిమిషాలు వెగించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు స్పూన్ల కిస్ మిస్ వేసి వేగించి ఒక్క కప్పులోకి తీసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి అరకప్పు ఎండు కొబ్బరి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు తెల్ల నువ్వులను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గసగసాలను వేగించి పక్కన పెట్టుకోవాలి. వేగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ కొంచెం చల్లరనివ్వాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో వేగించిన బాదం పప్పు,జీడిపప్పు,పిస్తా పప్పు,నువ్వులను వేసి బరకగా మిక్సీ చేయాలి. ఈ పొడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేగించిన కిస్ మిస్, ఒక కప్పు గింజలు తీసేసిన ఎండు ఖర్జూరం వేసి మిక్సీ చేయాలి. దీనిలో పైన తయారుచేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి,కొబ్బరి పొడి, పావు స్పూన్ యాలకుల పొడి, అరస్పూన్ మిరియాల పొడి వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి,గసగసాలను వేసి బాగా కలిపి లడ్డులుగా చేసుకొని ప్రతి రోజు ఒక లడ్డు తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అంది ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ లడ్డూలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/