1 గ్లాస్ తాగితే నీరసం,అలసట,నిస్సత్తువ తగ్గటమే కాకుండా రక్తహీనత సమస్య తగ్గుతుంది
Summer Dry Fruit Drink : వేసవి కాలం ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అలా బయటకు ఒక్కసారి వెళ్ళి వచ్చామంటే ఎండ వేడికి నీరసం,నిస్సత్తువ వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే నీరసం తగ్గటమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ డ్రింక్ చేయటం చాలా సులభం.
రాత్రి సమయంలో 5 ఖర్జూరాలు, ఒక అంజీర్ లను నీటిలో వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసు పాలను పోసి కాస్త వేడి అయ్యాక ఖర్జూరం,అంజీర్ పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ యాలకుల పొడి,ఒక స్పూన్ బెల్లం పొడి వేసి ఒక నిమిషం మరిగించాలి.
మరిగిన ఈ పాలను వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ తాగితే అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి తగ్గి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువగా వినిపిస్తుంది. ఆ సమస్యతో బాధపడేవారు ఈ పాలను తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడతారు.
వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త సరఫరా బాగా సాగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మతిమరుపు సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పాలను తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/