స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా స్లిమ్ గా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్
Weight Loss Drink In Telugu Dalchina Chekka :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం.ఈ డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.
పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఒక నిమిషం మరిగాక చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత పావు టీస్పూన్ పసుపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక దించి వడకట్టాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పు తాగాలి.
ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ తాగాక 40 నిమిషాల వరకు ఏమీ తినకూడదు తాగకూడదు. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ డ్రింక్ తాగాలి.ఈ డ్రింక్ ని ఐదు రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరో ఐదు రోజులు తాగాలి. ఈ విధంగా డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది.
మిరియాల, దాల్చిన చెక్క, అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. కేలరీలు కూడా వేగంగా ఖర్చవుతాయి. దాంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వేడి శరీరం ఉన్నవారు రోజుకి ఒకసారి మాత్రమే తాగాలి. ఎందుకంటే పైన చెప్పిన పదార్థాలన్నీ వేడి చేసే పదార్ధాలు. వేడి శరీరం ఉన్నవారు ఈ డ్రింక్ తాగినప్పుడు ఏమైనా అసౌకర్యం ఉంటే డ్రింక్ తాగడం మానేయాలి.. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/