గజని సినిమాని రెజెక్ట్ చేసిన 12 మంది హీరోలు…పవన్ తో సహా…
Ghajini Telugu Full Movie : షార్ట్ మెమొరీ లాస్ పేషెంట్, ఒక టాప్ మొబైల్ బిజినెస్ మెన్, మంచి ప్రేమికుడు .. ఇలా విభిన్న కోణాలు ఆవిష్కరిస్తూ హీరో సూర్య అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో సూపర్ స్టార్ గా నిలిచాడు. ఏ ఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ అప్పట్లో నిజంగా ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఇక నయనతార, ఆసిన్ నటన టాప్. 2005 లో ఈ సినిమా షూటింగ్ మొదలై, 10 కోట్ల బడ్జెట్ తో 90 రోజుల్లో పూర్తిచేశారు.
ఇందులోని సాంగ్స్ అన్నీ సూపర్. ముఖ్యంగా “హృదయం ఎక్కడున్నది” పాట అప్పుడే కాదు, ఇప్పటికీ అందరి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా చాలామంది దగ్గరికి వెళ్లి చివరకు సూర్య దగ్గరకు చేరింది. ఎందుకంటే, పదిహేను నిమిషాలకి తన గతాన్ని మర్చి పోయే హీరో పాత్ర అనగానే ఇబ్బందిగానే ఉంటుంది. పైగా హీరో గుండు చేయించుకోవాలి, డ్రాయర్ మీద నిలబడాలనేవి కూడా కథలో భాగం.
నిజానికి ఈ కథని తెలుగులో మహేష్ బాబుతో తీస్తే అదిరిపోతుందని మురుగుదాస్ భావించి, హైదరాబాద్ వచ్చి మెగా నిర్మాత అల్లు అరవింద్ కి కథ చెప్పడంతో చాలా బాగుందని, ఈ సినిమా చేద్దామని, అయితే ముందు మహేష్ బాబుని ఒప్పించమని చెప్పారట. అయితే ఈ కధకు మహేష్ ఓకే చెప్పక పోవడంతో ఆతర్వాత పవన్ కళ్యాణ్ తో తీద్దామని భావించారట.
అయితే అప్పటికే జానీ ప్లాప్ తో కష్టాల్లో ఉండడంతో ఈ సినిమాకి పవన్ నో చెప్పేసాడు. అరవింద్ ఈ సినిమా చేస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో ఇక తెలుగులో కుదరదని తమిళ్ స్టార్ హీరోల వైపు మురుగుదాస్ కన్నేశాడు. కమల్ హాసన్ తో సహా దాదాపు 10 మంది హీరోలు నో చెప్పేసారు. చివరకు తన మొదటి సినిమాలో హీరోగా చేసిన అజిత్ కి కథ చెప్పడం, ఆ కథ నచ్చడంతో మురుగుదాస్ టాప్ హీరో దొరికాడని ఊపిరి పీల్చుకున్నాడు.
వెంటనే హీరోయిన్స్ గా ఆసిన్ అండ్ శ్రీయాలను, విల్లన్ గా ప్రకాష్ రాజ్ ని తీసుకొని ఈ సినిమాకి మిరత్తల్ అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసాడు అయితే నాలుగు రోజులు షూటింగ్ జరిగాక ఎందుకో గాని అజిత్ ఈ సినిమా చేయట్లేదని ప్రకటించాడు.
దాంతో అప్పుడప్పుడే తమిళ్ లో ఫ్యాన్స్ అవుతున్న హీరో సూర్యని కలిసి గజని కథ వినిపించాడు. అలా ఒకే అయింది. అయితే అప్పటికే శ్రీయ అండ్ ప్రకాష్ రాజ్ డేట్స్ అయిపోవడంతో వాళ్ళ ప్లేస్ లో నయనతార, ప్రదీప్ రావత్ లకు ఛాన్స్ దక్కింది. సూర్య చాలా కష్టపడి చేసిన నటనకు మంచి పేరు వచ్చింది.
https://www.chaipakodi.com/