Healthhealth tips in telugu

తెల్ల ఉల్లిపాయను ఎప్పుడైనా తిన్నారా…ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు

White Onion Health Benefits In telugu : ఉల్లిపాయ అంటే కొంతమంది ఇష్టంగా తింటారు. కొంతమంది ఉల్లిపాయ తినటానికి ఇష్టపడరు. ఉల్లిపాయను పచ్చిగా లేదా ఉడికించి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సాదారణంగా మనలో చాలా మంది ఎర్ర లేదా పసుపు ఉల్లిపాయలను తింటూ ఉంటారు. అయితే తెల్ల ఉల్లిపాయలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Diabetes In Telugu
ముఖ్యంగా తెల్ల ఉల్లిపాయ డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. దీనిలో క్రోమియం మరియు సల్ఫర్ ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయలో క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీడియాబెటిక్ ప్రభావాలు ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
gas troble home remedies
తెల్ల ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. తెల్ల ఉల్లిపాయ తీసుకోవటం వలన యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
Joint pains in telugu
ఎముక సాంద్రతను మెరుగుపరచి ఎముకల నష్టంను తగ్గిస్తుంది. అలాగే వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన మంటతో పోరాటం చేస్తాయి. అలాగే ట్రైగ్లిజరైడ్లను, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అంతేకాక శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన అధిక రక్తపోటును తగ్గించడానికి మరియు రక్తం గడ్డకట్టకుండా రక్షించడానికి సహాయపడతాయి. ఫ్లేవనాయిడ్లు మరియు సల్ఫర్ ఉండుట వలన రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉండేలా చేసి సిరలు మరియు ధమనుల ద్వారా రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయ కాస్త ఘాటు తక్కువగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/