Healthhealth tips in telugu

పెరుగన్నంలో అరటిపండ్లను కలిపి తినే అలవాటు ఉందా…ఈ నిజాలు తెలుసుకోండి

Curd Rice with Banana:మనలో చాలామందికి పెరుగన్నంలో అరటిపండు కలిపి తినే అలవాటు ఉంటుంది. అయితే అటువంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అరటిపండు పెరుగు కలిపి తీసుకోవటం వలన మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా,calcium, విటమిన్లు మినరల్స్ పెరుగులో సమృద్ధిగా ఉంటాయి. అయితే ఐరన్, ఫైబర్, విటమిన్లు అరటి పండ్లలో సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండు పెరుగు కలిపి తింటే రోజంతా శరీరంలో శక్తి నిల్వలు ఉండి అలసట నిసత్తువ అనేవి ఉండవు. ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని అందుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది. పెరుగులో అరటిపండు కలిపి తింటే శరీరంలో కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది.
banana benefits in telugu
ఎందుకంటే పెరుగు అరటిపండు రెండింటిలోనూ పైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఉదయం సమయంలో తీసుకోవడం వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. ఎక్కువగా తినకుండా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.అరటిపండులో ఉండే ఫైబర్ పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతిస్తుంది.

దాని కారణంగా calcium ఎముకలకు బలాన్ని ఇస్తుంది. పెరుగు అరటి పండును బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. తొందరగా పెళుసుగా మారకుండా ఉంటాయి. ఈ విధంగా తినటం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అయితే కొంత మంది పెరుగన్నంలో అరటి పండును తింటారు. ఎలా తీసుకున్న ఈ ప్రయోజనాలు అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/