మావారు మాస్టారు సీరియల్ హీరో గురించి ఈ విషయాలు తెలుసా…?
Maavaaru Mastaru Serial:మావారు మాస్టారు సీరియల్ జూన్ 12 న ప్రారంభం అయింది. ఈ సీరియల్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై వస్తుంది. ఈ సీరియల్ లో టీచర్నే పెళ్లి చేసుకోవాలని కలలు కనే శ్రీవిద్యగా సంగీత కల్యాణ్ కుమార్ నటిస్తుండగా, కొడుకుని టీచర్‌గా చూడాలని ఆశపడే పార్వతీగా ప్రముఖ నటి మీనా కుమారి నటిస్తున్నారు. ఇక, గణపతిగా పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
పృథ్వీరాజ్ కన్నడ నటుడు. కన్నడ, తమిళ సీరియల్స్ చేస్తూ మరో పక్క కన్నడ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కన్నడలో మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ కి చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండటంతో ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మంచి పేరు సంపాదించాలని కోరుకుందాం.