MoviesTollywood news in telugu

Adipurush:‘ఆదిపురుష్‌’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందంటే…ఎప్పుడో తెలుసా…?

Adipurush OTT News:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో త్రీడీ ఎఫెక్ట్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో లేనంత అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
Adipurush
ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ రాముడిగా అద్భుతంగా నటించాడు. అలాగే సీత పాత్రలో కృతి సనన్ కూడా బాగా నటించింది. భారీ అంచనాలతో విడుదల అయినా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీగా ధరను చెల్లించి దక్కించుకుందని సమాచారం.

ఈ సినిమా విడుదల అయినా 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ సమాచారం. అన్ని భాషల్లో కలిపి 150 కోట్లకు పైనే ఈ డీల్ కుదిరినట్లు టాక్ హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ బజ్ తో ప్రేక్షుకుల్లో ఆసక్తిని కలిగించింది.