MoviesTollywood news in telugu

మాతృదేవోభవ మూవీ వెనుక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా ?

Matru Devo Bhava Movie :బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తుందని అనుకుంటాం గానీ, కొన్ని సెంటిమెంట్ సినిమాలు కూడా కలెక్షన్స్ ఏమాత్రం తీసిపోవని నిరూపించాయి. అందులో మాతృదేవోభవ సినిమా ఒకటి. 1993లో వచ్చిన ఈ మూవీ ని కె ఎస్ రామారావు నిర్మించగా, అజయ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. సీనియర్ నటి మాధవి,నాజర్,కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, తదితరులు నటించిన ఈ సినిమా మలయాళంలో నిర్మించిన ఆకాశ దూతకు రీమేక్.

అంగరక్షకుడు మూవీ టైం లో తెలుగు వారికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని కె ఎస్ రామారావు, భావించి మాతృదేవోభవ మూవీ గా రీమేక్ చేసారు. హక్కులు కొనేసి,సత్యమూర్తితో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. మలయాళంలో చేసిన మాధవికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆమెనే ఎంపిక చేసారు. హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ చేసారు. కీరవాణి అద్భుత సంగీతానికి వేటూరి రచన తోడై పాటలు అదిరిపోయాయి. అక్టోబర్ 22న ఈ సినిమా మాములుగా రిలీజయింది. జనం లేకపోవడంతో రెండోవారం నుంచి నడవడం కష్టమని తేల్చేసారు.

అయితే నష్టాన్ని భరించే భరోసాతో మరికొన్నాళ్లు కొనసాగించమని కోరడంతో థియేటర్లలో నడిచింది. సినిమాకు వచ్చినవాళ్ళను కర్చీఫ్ లు ఫ్రీగా ఇస్తామన్న ప్రకటనతో జనం విస్తుపోయారు. అంతలా ఏడిపించారా చూద్దాం అనేవిధంగా థియేటర్ బాట పట్టారు. నిజంగా కర్చీఫ్ లు తడిసిపోయేవిధంగా మహిళలు కన్నీళ్లు పెట్టారు. తాగుడికి గురైన భర్త మరణిస్తే, తాను కూడా అనారోగ్యం పాలవ్వడంతో పిల్లలను దత్తత ఇచ్చే సీన్స్ తో సాగిన సినిమా మాతృదేవోభవ జైత్ర యాత్ర సాగించింది. 5కోట్ల దాకా వసూళ్లు రావడం చూసి,అందరూ షాక్ తిన్నారు. 10సెంటర్స్ లో వంద ఆడింది. ఇలాంటి తరహాలో పితృదేవో భవ తీస్తే తాను చేయడానికి సిద్ధమని శోభన్ బాబు ప్రకటించడం విశేషం. కాగా రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే పాట కు నేషనల్ అవార్డు వచ్చింది.
https://www.chaipakodi.com/