MoviesTollywood news in telugu

Adipurush: ఆదిపురుష్‌లో హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా…?

Adipurush:ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన Adipurush సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా… హనుమంతుడిగా దేవదత్తా నటించారు.

ఈ సినిమాలో హనుమంతుడిగా నటించిన నటుని గురించి చాలా మంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.హనుమంతుడిగా నటించిన దేవదత్తా మరాఠి నటుడు. దేవదత్తా హిందీ, మరాఠీ సీరియల్స్ లో నటించి ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. జీ మరాఠీ ఛానల్‌లో జై మల్హర్‌ అనే సీరియల్‌లో లార్డ్ ఖండోబా పాత్రను పోషించి పాపులర్ అయ్యాడు.
Adipurush
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్‌కు చెందిన దేవదత్తా కలర్స్ టీవీలో ” వీర్ శివాజీ ” అనే సీరియల్‌ లో తానాజీ మలుసరే పాత్రతో టెలివిజన్ రంగానికి వచ్చాడు. ఆ తర్వాత 2014లో “ సంఘర్ష్ ” చిత్రం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమాలు చేస్తూ…ఓమ్ రౌత్ దర్శకత్వంలో వచ్చిన ” తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ “లో అతను సూర్యాజీ మలుసరే పాత్రను పోషించాడు. ఇక ఇప్పుడు ఆదిపురుష్‌లో హనుమంతుడిగా నటించి అభిమానులను మెప్పించాడు.