Face Glow Tips:5 రూపాయిల ఖర్చుతో ఎంతటి నల్లని ముఖం అయిన తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది
Sanagapindi and alovera Face Glow Tips : ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది సహజం కూడా. ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు రాగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. అలా కంగారు పడి పోకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ Fair & Lovely క్రీం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక నిమిషం నిదానంగా మసాజ్ చేయాలి. పది నిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముఖం పై ఉన్న మృత కణాలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
కలబందలో ఉండే ఒక సమ్మేళనం చనిపోయిన మృతకణాలను తొలగించి నల్లటి మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది. ఇంటిలో కలబంద మొక్క ఉంటే తాజా జెల్ ఉపయోగిస్తే మంచిది…లేకపోతే మార్కెట్ లో దొరికే ఆలోవెరా జెల్ అయినా వాడవచ్చు. ఆలోవెరా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.
కలబందలో 96% కంటే ఎక్కువ నీటితో తయారైన జెల్ లాంటి ద్రవాన్ని కలిగి ఉంటుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి, సి మరియు ఇ మరియు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉండే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక కొత్త చర్మ కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
శనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం మీద ఉన్న మలినాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. శనగపిండి అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. Fair & Lovely ని మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం.
శనగపిండిలో యాంటీ ఏజింగ్‌గా ఉత్తమంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, లినోలెయిక్ మరియు ఒలీక్ ఆమ్లాలు వంటి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మరియు రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలేట్ మరియు బీటా-కెరోటిన్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు, ఫైబర్‌లు మరియు ప్రొటీన్‌లు సమృద్ధిగా ఉండుట వలన అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్ గా పనిచేస్తుంది.
బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మంచి ఫలితాన్ని పొందుతారు. కేవలం మూడు ఇంగ్రిడియన్స్ తో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u