Face Glow Tips:ఇలా చేస్తే చాలు ముఖం ఎంత నల్లగా,జిడ్డుగా ఉన్నా సరే తెల్లగా మెరిసిపోతుంది
Coffee Face Glow Tips:ముఖం మీద మచ్చలు లేకుండా అందంగా,తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖం తెల్లగా మెరవటానికి మరియు జిడ్డు తొలగించుకోవటానికి మరియు నల్లని ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకోవాలి. ఆ తర్వాత అరస్పూన్ పంచదార వేసి కలపాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహాయపడుతుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా స్మూత్ గా మంచి గ్లో తో ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి ముఖ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. పంచదార చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది.
నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖ ఛాయ మెరుగుపరచటానికి సహాయపడతాయి. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంటి చిట్కాలను ఓపికగా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.