మూత్రంలో మంట, శరీరంలో వేడి, యూరినరీ ఇన్ ఫెక్షన్ ని తగ్గించే అద్భుతమైన ఆకు
urinary tract infection : యూరినరీ ఇన్ ఫెక్షన్ అనేది మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య అనేది నీరు ఎక్కువగా తాగకపోవటం వంటి అనేక రకాల కారణాల వలన వస్తుంది. ఈ ఇన్ ఫెక్షన్ ఉన్నప్పుడూ విపరీతమైన నొప్పి ఉంటుంది. యూరిన్ రంగు మారాటమే కాకుండా యూరిన్ చాలా తక్కువగా వస్తుంది.
ఈ సమస్యను తగ్గించటానికి కొండపిండి ఆకు చాలా బాగా సహాయపడుతుంది. కొండ పిండి ఆకులో యూరినరీ ఇన్ ఫెక్షన్ మీద పోరాటం చేసే లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. కొండపిండి ఆకు పల్లెటూర్లలో విరివిగా లభ్యం అవుతుంది. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి డికాషన్ చేసుకొని తాగవచ్చు. కొండపిండి ఆకు లేకపోతే కొండపిండి ఆకు పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఈ విధంగా తాగటం వలన యూరినరీ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా కిడ్నీలో రాళ్ళ సమస్య,మూత్రంలో మంట, శరీరంలో వేడి ఇలా అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.