Beauty Tips

7 రోజుల్లో జుట్టు రాలే సమస్య,చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Alovera Hair Fall Tips : జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అనేవి ఈ రోజుల్లో సాదారణ సమస్యలు అయ్యిపోయాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా రెండు స్పూన్ల ఆవిసే గింజలను తీసుకొని ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పది నిమిషాలు మరిగించాలి.

ఇలా మరిగిస్తే ఆవిసే గింజల నుంచి జెల్ వస్తుంది. ఈ జెల్ ని ఒక బౌల్ లో తీసుకోవాలి. దీనిలో ఆలోవెరా జెల్ వేయాలి. కలబంద మొక్క ఇంటిలో ఉంటే ఆ తాజా జెల్ ఉపయోగించండి. కలబంద మొక్క లేకపోతే మార్కెట్ లో దొరికే జెల్ ఉపయోగించవచ్చు. ఆవిసే గింజల జెల్,ఆలోవెరా బాగా కలిసేలా కలపాలి.
kalabanda benefits in telugu
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట వదిలేసి ఆ తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య ,చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆవిసే గింజలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/