DevotionalToday Rasi Phalalu In telugu

జూన్ 20 ధన జ్యోతిష్యం..ఏ రాశి వారికీ ఎలా ఉంటుందో…?

Money Astrology: మనలో కొంత మంది జాతకాలు నమ్ముతారు. కొంతమంది జాతకాలు నమ్మరు.జాతకాలను నమ్మేవారు ప్రతిరోజు వారి రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు.

మేష రాశి
ఈ రాశి వారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉపవాసం చేసి హనుమంతునికి తమలపాకులు సమర్పించాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు తమ తెలివితేటలు, చాకచక్యంతో వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. వీరికి పని విషయంలో ఎవరి సహకారం ఉండదు. .

మిధున రాశి
ఈ రాశి వారికి పనిలో విజయం కలుగుతుంది. అయితే విజయాన్ని డబ్బుతో ముడి పేడితే సంతోషాన్ని కోల్పోతారు. అసహనం లేకుండా చూసుకోవాలి.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని తపన వదిలేసి తృప్తిగా ఉండాలి. లేదంటే కొన్ని సమస్యలు వస్తాయి.

సింహరాశి
డబ్బు విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. పని సకాలంలో పూర్తి చేయకపోతే తర్వాత పనుల మీద ప్రభావితం జరుగుతుంది. కాబట్టి పనుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి
గతంలో రావాల్సిన డబ్బు వస్తుంది. ఖర్చు విషయంలో ఇబ్బంది లేదు. భవిష్యత్తు గురించి డబ్బులు ఆదా చేస్తారు.

తులారాశి
ఈ రాశి వారు వ్యాపారంలో సంతృప్తికరమైన లాభాలను పొందుతారు. డబ్బుతో పాటు ఇతర ఆనందాలు కూడా పెరుగుతాయి. గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి
కొన్ని పాత విషయాల వల్ల కొంతమందితో శత్రుత్వం పెరుగుతుంది. అయితే కొన్ని ప్రభావాలకు లోను కాకుండా ఉండాలి.

ధనస్సు రాశి
ఈరోజు ఈ రాశి వారికి కొన్ని విషయంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి
ఈరోజు పని చేసే సమయంలో శ్రమ ఎక్కువ అవ్వటం మరియు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు ఆదాయం కోసం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు.

కుంభరాశి
మిగతా రోజులతో పోలిస్తే ఈరోజు లాభం చాలా తక్కువగా ఉంటుంది. జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇంటి సభ్యులు మీ పట్ల అసంతృప్తితో ఉంటారు.

మీన రాశి
ఈరోజు ఏదో ఒక రూపంలో ఎక్కువ లాభం ఉంటుంది. కానీ చంచలమైన ఆలోచనలతో లాభాన్ని దూరం చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ ఆలోచించకుండా సరదాగా గడుపుతారు.