నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే…ఏమి జరుగుతుందో తెలుసా…?
30 day no sugar:ఉదయం లేవగానే కాఫీ, టీ తాగుతూ ఉంటాం. కాఫీ, టీలో పంచదార లేకపోతే మనలో చాలామంది టీ కానీ కాఫీ కానీ తాగలేరు. అలాగే స్వీట్స్ కూడా ఎక్కువగానే తింటూ ఉంటాం. అయితే పంచదారను నెల రోజుల పాటు మానేస్తే ఏం జరుగుతుంది తెలుసా…?
పంచదార కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ మరియు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. 30 రోజులపాటు చక్కెరను మానేస్తే శరీరం మీద మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
పంచదారని తగ్గించడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వలన అది అవయవాలు చుట్టూ కొవ్వులు పేరుకుపోయేలా చేస్తుంది. ఇది అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది. పంచదార ని ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం, గుండెపై కూడా ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఒక నెల రోజులపాటు పంచదారను తీసుకోవడం మానేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. పంచదారకు దూరంగా ఉంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల వ్యాధి మరియు కావిటీస్ రెండు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తీపి పదార్థాలు తిన్నప్పుడు ఆ ముక్కలు పళ్ళల్లో ఇరుక్కుపోయి బ్యాక్టీరియాకు కారణం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.