అరస్పూన్ పొడి అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది
Kala jeera Weight Loss : ఈ కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సరైన సమయంలో తినకపోవటం వంటి అనేక కారణాలతో అధిక బరువు సమస్య అనేది చాలా మందిలో కనిపిస్తుంది. అధిక బరువు ఉంటే డయాబెటిస్, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చేస్తాయి.
అలాగే ఏ చిన్న పని చేసిన అలసట, నీరసం వచ్చేస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే అధిక బరువు సమస్య నుంచి బయట పడాలి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఒక కప్పు అవిసె గింజలు, ఒక కప్పు నల్ల జీలకర్ర తీసుకొని ఒక పాన్ లో వేసి నూనె లేకుండా వేగించి పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడిలో పావుకప్పులో సగం సైంధవలవణం కలపాలి.
ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా తాగటం వల్ల శరీరంలో జీవక్రియ రేటు .పెరిగి అధిక బరువు, శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులు., మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి.
నల్ల జీలకర్ర లో విటమిన్ ఎ, సి, కె ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన డయాబెటిస్ నియంత్రణ, మంచి జ్ఞాపకశక్తి కి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. అవిసె గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి త్వరగా తినాలనే కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.