MoviesTollywood news in telugu

ఆ సినిమా చూసి మెగాస్టార్ నిజంగా బాధ పడ్డాడట….ఆ సినిమా ఏమిటో తెలుసా?

Megastar Chiranjeevi Movie:అరవై ఏళ్ళ పైబడిన వయసులోనూ నిత్యం సినీ అభిమానులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 దాటి మూవీస్ చేసినప్పటికీ కూడా ఇప్పటికి తన హుందా గా ఉంటాడు. ఎక్కడా గర్వాన్ని ప్రదర్శించకుండా చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే మెగాస్టార్ తీరు ఎందరో స్టార్స్ కి స్ఫూర్తి. ఈ విషయాన్నీ పలు సందర్భాలలో పలువురు స్టార్స్ ఓపెన్ గా చెప్పసారు కూడా.
swathi muthyam movie child artist karthik
సున్నిత మనస్కుడైన చిరంజీవి ఒక స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాక కూడా ఓ సినిమా బాధ పెట్టిందట. 1986లో స్వాతిముత్యం విడుదలై బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుంది. కమర్షియల్ సినిమాకు ధీటుగా విడుదలైన అన్నీ కేంద్రాల్లో వందరోజులు ఆడింది. అందులో కమల్ హాసన్ నటన గురించి మాట్లాడుకోని ప్రేక్షకుడు లేరు. దాని గురించి విన్న చిరంజీవి స్వాతిముత్యంని ప్రత్యేకంగా చూసాక, ఒక్కసారిగా నిరాశ కి గురయ్యాడట.

సుప్రీమ్ హీరో డైనమిక్ స్టార్ అనిపించుకుంటున్నాం మనకేం తక్కువ అనుకుంటున్న టైంలో స్వాతి ముత్యంలో కమల్ విశ్వరూపం చూసి తానెం కోల్పోతున్నానో చిరంజీవి అర్ధం చేసుకున్నాడు. ఇలాంటి పాత్ర నాకు రాలేదే అని బాధపడుతూ, ఇంత గొప్పగా పర్ఫార్మ్ చేసే సబ్జెక్టు నాకు దొరుకుతుందా అని ఓ రెండు మూడు రోజులు తెగ మధన పడ్డాడట.

సరిగ్గా ఆ సమయంలో చిరుతో పాటు హీరోయిన్ సుహాసిని నటిస్తోందట. ఎప్పుడూ హుషారుగా ఉండే చిరు డల్ గా ఉండటానికి కారణం అడిగి తెలుసుకుందట. గొప్ప నటులకు టైం వచ్చినప్పుడు అలాంటి కథ ప్రతీ ఒక్కరికి వస్తుందని చెప్పి, దర్శకుడు విశ్వనాథ్ కి అలాగే కమల్ కి చేరవేశారు. అలా సుహాసిని తన బాధను విశ్వనాధ్ గారికి చెప్పడం.. అటు తరువాత ఆయన ‘స్వయంకృషి’ చిత్రం చేయడంతో.. తనకు ఆ లోటు తీరిందని చిరు అంటుంటారు. స్వయంకృషి మూవీలో అద్భుత నటన ప్రదర్శించి మెగాస్టార్ అసలైన స్టార్ గా మరో మెట్టు అధిరోహించాడు.