MoviesTollywood news in telugu

సినిమాల్లో చిన్న పాత్రలు వేసి స్టార్స్ గా మారిన టాలీవుడ్ ప్రముఖులు

Tollwood Stars News:సినిమాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వెండితెరపై తళుక్కున్న మెరిసి స్టార్ ఇమేజ్ తో వెలిగిపోతారు. జస్ట్ కొంచెం సేపు అలా కనిపించిన వాళ్ళు ఆతర్వాత స్టార్ హీరోలుగా,స్టార్ డైరెక్టర్లుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో యాంకర్ రష్మీ, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి , హరీష్ శంకర్ వంటి టాలీవుడ్ స్టార్స్ మనకి తెలియని చాలా సీన్ లలో కనిపించారు. ప్రత్యేకంగా గమనిస్తే తప్ప ఈ విషయం పెద్దగా తెలీదు.
Tollywood Hero Raviteja remuneration
మాస్ రాజా రవితేజ ఇప్పుడు ఒక స్టార్ హీరో. ఎన్నో హిట్స్ తో బిజీ గా ఉండే రవితేజ, సినిమాల్లో కి రావడానికి చాలా కష్ట పడ్డాడు . చిన్న చిన్న వేషాల కోసం కూడా పరితపించేవాడు. ఇక అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ స్నేహితుల బ్యాచ్ లో ఒకడిగా నటించాడు.

అలాగే బాయ్స్ , బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి అమ్మాయిల మనస్సులు దోచుకున్న సిద్దార్థ్ నటనలోకి రాకముందు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేసాడు. అయితే అమృత అనే సినిమాలో బస్ లో ఒక్క చిన్న పాత్రలో జస్ట్ కనిపిస్తాడు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్. తరువాత వరసగా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయినప్పటికీ మళ్ళీ మంచి సబ్జెక్ట్ లు ఎంచుకొని వరుస హిట్ లతో దూసుకు పోతున్నాడు. అయితే సంబరం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపిస్తాడు.

ఇక అనసూయ అనగానే అందరికీ జబర్దస్త్ ప్రోగ్రాం గుర్తుకొస్తుంది. అంతేకాదు ఇప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అక్కడా బిజీ అయింది. అయితే ఈమె నాగ సినిమాలో కొన్ని సెకండ్లు అలా కనిపించి వెళ్ళిపోతుంది.
vijay devarakonda
ఇప్పుడు ఎక్కువ మంది యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో అమాంతం స్టార్ హీరోగా ఎదిగిన ఈ హీరో, గీత గోవిందం తో 100 కోట్ల వసూళ్లు చేసిన నటుల జాబితాలో చేరిపోయాడు. విజయ్ స్టార్ కాకముందు నువ్విలా , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో కనిపించాడు.

హృదయ కాలేయం అనే సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని , తెలుగు బిగ్ బాస్ లు ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు మహాత్మా సినిమాలో చిన్న రాజకీయ నాయకుడు పాత్రలో దర్శనమిస్తాడు.

తెలుగు సినిమాలో తన కామెడీ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి తరువాత సినిమా హీరో గా మారిన సునీల్ , ఎవరికి అంత పెద్దగా తెలియని రోజుల్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో ఒక సీన్ లో అలా కనిపించి వెళ్ళిపోతాడు.

ఇక స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో దాదాపు ప్రతి స్టార్ హీరో తో సినిమాలు చేసాడు. అయితే రామ్ గోపాల్ వర్మ తీసిన బ్లాక్ బస్టర్ శివ సినిమాలో బొటనీ క్లాస్ ఉంది పాటలో కనిపిస్తారు.

అలాగే పటాస్ ,సుప్రీం , రాజా ది గ్రేట్ , f2 వంటి వరుస హిట్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ 2తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే గోపి చంద్ నటించిన శౌర్యం సినిమాలో ఒక్క సీన్ లో మనకి కనిపిస్తాడు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,కొత్త బంగారు లోకం లాంటి హిట్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల అయితే ఆర్య సినిమాలో ఒక్క సీన్ లో కనిపిస్తాడు.
https://www.chaipakodi.com/