ఈ గింజలతో ఇలా చేస్తే యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా శరీరంలో వేడి కూడా ఉండదు
urine infection : యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించడం వల్ల వస్తుంది అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్ఫెక్షన్ మరియు వాపుకు గురవుతుంది.
మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం.
బార్లీ సులభంగా మరియు చౌకగా లభించే తృణధాన్యం. బార్లీ నీరు యూరినరీ ఇన్ఫెక్షన్‌కు గొప్ప ఔషధం. ఈ చిన్న గింజలు శరీరంలో వేడిని తగ్గించి చల్లబరుస్తాయి. ఈ చల్లబరిచే గుణాలు మరే ఇతర తృణధాన్యాలకు లేవు. బార్లీ నీటిని తాగటం వలన ఇన్ఫెక్షన్లు, బాక్టీరియా శరీరం నుండి బయటకు పోతాయి.
బార్లీ నీటిలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కిడ్నీల్లో రాళ్ళను తొలగించటానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు బార్లీ నీరు మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక రెండు స్పూన్ల బార్లీ గింజలను వేయాలి.
దాదాపుగా 15 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి కొంచెం చల్లారాక తాగాలి. 2 గ్లాసుల బార్లీ నీటిని ఒకేసారి త్రాగాలి. రోజులో రెండు సార్లు బార్లీ నీళ్లు తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ 2 రోజుల్లో మాయమవుతుంది. ప్రతి రోజూ మంచినీళ్ళు కూడా 4 లేదా 5 లీటర్లు త్రాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/