కృష్ణుడి గెటప్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?
Tollywood Heroine Anupama Parameswaran: తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించినటువంటి అ.ఆ అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి మెప్పించినటువంటి కోలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ అమ్మడు గ్లామర్ పరంగా తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు చేయడంతో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలను కోల్పోయింది.
అయినప్పటికీ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటోంది.అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ తన చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసుకొని తీయించుకున్న ఫోటో.అయితే ఈ ఫోటోని అనుపమ పరమేశ్వరన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన మూడు గంటల లోపే దాదాపుగా 2 లక్షల 60 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అనుపమ పరమేశ్వర్ కి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అని.అయితే మరి కొంతమంది అభిమానులు మాత్రం ఈ ఫోటోకి చిన్నప్పుడు కృష్ణుడు వేషంలో భలే ముద్దుగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు వరుస పరాజయాలతో పాటు క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమైన అనుపమ పరమేశ్వరన్‌కు కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉంది. గతేడాది చివర్లో మళ్లీ నిఖిల్‌తో కలిసి నటించిన ‘18 పేజీస్’ మూవీకి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు 2022 యేడాది చివరి హిట్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అదే ఊపులో ‘టిల్లు స్వ్కేవర్’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.
https://www.chaipakodi.com/