అరవింద సమేత సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Aravinda Sametha Movie Online :టాలీవుడ్ లో 1999లో ప్రముఖ సినీ దర్శకుడు కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయం వరం మూవీతో వేణు సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లయ ఆతర్వాత మంచి పాత్రలతో బాగా రాణించింది. జగపతి బాబు,శివాజీ, జెడి చక్రవర్తి, నటుడు సాయి కిరణ్, వినీత్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది.ప్రేమించు చిత్రంలో అంధురాలి పాత్రలో అదరగొట్టిన లయ వరుస విజయాలతో దూసుకెళ్లింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత చిత్రంలో నటి ఈశ్వరీరావు పోషించిన రెడ్డమ్మ పాత్రకోసం ముందుగా లయ ని చిత్ర యూనిట్ అడిగిందట. అయితే అనివార్య కారణాలతో అందులో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ప్రముఖ నటి ఈశ్వరీరావుకి ఆ ఛాన్స్ దక్కింది. రెడ్డమ్మ పాత్రకి ఆమె నూరుశాతం న్యాయం చేసింది.ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన హైలెట్ అయింది.
కాగా లయ సినిమాల్లో చేస్తున్న రోజుల్లో రాజకీయ ప్రచారంలో కూడా పాల్గొంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ లోక్ సభ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తే ఆయనకు మద్దతుగా ప్రచారం చేసింది. ఇక సినిమాల్లో రాణిస్తున్న సమయంలో అమెరికాకి చెందిన గణేష్ గుర్తి అనే ఓ వైద్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమైనా లయ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉంటోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2018 లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో హీరో తల్లి పాత్రలో చేసినా,ఆ మూవీ డిజాస్టరయింది
https://www.chaipakodi.com/