Beauty Tips

కరివేపాకులో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలకుండా 100 % పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది

Curry Leaves Hair Fall Tips : ఈ మధ్య కాలంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, తడి జుట్టును దువ్వటం, ఎక్కువగా హెయిర్ స్టైల్ టూల్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారి జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువైపోయింది. జుట్టు కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ప్యాక్ వారంలో రెండుసార్లు వేస్తే సరిపోతుంది.
fenugreek seeds
రాత్రి సమయంలో ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి. కలబందని తీసుకొని శుభ్రంగా కడిగి జెల్ సపరేట్ చేయాలి. జెల్ రెండు స్పూన్లు ఉండేలా చూసుకోవాలి. మిక్సీ జార్ లో నానిన మెంతులు, కలబంద జెల్ వేయాలి. ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకు, రెండు స్పూన్ల పుల్లని పెరుగు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి.
kalabanda beauty
ఆ తర్వాత ఒక స్పూన్ మూల్తాని మట్టి వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసి షవర్ cap పెట్టుకోవాలి. అరగంట తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

ఈ ప్యాక్ చుండ్రు సమస్యను కూడా తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక, శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే జుట్టు రాలకుండా ఒత్తైన పొడవైన జుట్టు సొంతం అవుతుంది.
curry leaves
ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య కూడా జుట్టు రాలటానికి ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/