హెడ్‌ఫోన్స్‌ను 4 నిమిషాల కంటే ఎక్కువగా వాడుతున్నారా…రిస్క్ లో పడినట్టే…?
Headphones Side Effects In Telugu :ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ వలే హెడ్‌ఫోన్స్ కూడా నిత్య అవసరాలలో ఒకటిగా మారిపోయింది. సంగీతం వినడానికి, గంటల తరబడి ఫోన్ మాట్లాడడానికి లేదా సినిమా చూడడానికి యువత హెడ్‌ఫోన్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే హెడ్‌ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి షాకింగ్ వార్త ఒకటి చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
రోజులో నాలుగు నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్ వినియోగిస్తే ప్రమాదమని వెల్లడించింది. నాలుగు నిమిషాలకు మించి హెడ్‌ఫోన్స్ వినియోగిస్తే వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారిలో చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువని తెలిపింది.
పెద్దపెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయని, అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేమని, వినికిడి పరికరాలు వాడడం తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. భారత్‌లో వయసు పెరగడం వలన తలెత్తే వినికిడి సమస్యలకంటే పెద్ద శబ్దాలు వినడం వల్ల వినికిడి సమస్యలబారిన పడుతున్నవారే ఎక్కువమంది ఉంటున్నారని మనదేశానికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/